: బీజేపీ ఎంపీ ఆదిత్యనాథ్ సహా 340 మంది అరెస్టు


విశ్వహిందూ పరిషత్ లక్నోలో నిర్వహించ తలపెట్టిన సంకల్ప్ దివస్ యాత్ర నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పలువురిని అరెస్టు చేసింది. గొండా ప్రాంతంలో రైలులో ఉన్న బీజేపీ ఎంపీ ఆదిత్యనాథ్ తో పాటు మొత్తం 340 మందిని యూపీ పోలీసులు అరెస్టు చేశారు. 42 మందిని గృహనిర్బంధంలో ఉంచారు. అయోధ్యలో పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు. పట్టణాన్ని చేరుకునే అన్ని మార్గాలను పలు అంచెల భద్రతతో దిగ్బంధం చేశారు. గత నెల వీహెచ్ పీ తలపెట్టిన కోసీ యాత్రను కూడా యూపీ ప్రభుత్వం భగ్నం చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News