: మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ


దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసు రోజురోజుకీ పలు మలుపులు తిరుగుతోంది. తాజాగా ఇద్దరు వ్యక్తులను ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకుని బేగంపేటలోని తమ కార్యాలయానికి తరలించారు. వారినిప్పుడు విచారిస్తున్నట్లు సమాచారం. వీరిని నెల్లూరు జిల్లా జైలు నుంచి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. 

విచారణలో భాగంగా ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదులు మక్బూల్, ఇమ్రాన్ ఇచ్చిన సమాచారం ఆధారంగానే నెల్లూరు జైలు నుంచి వారిని తీసుకొచ్చినట్లుగా సమాచారం. దీంతో ఈ కేసు మరెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి. 

  • Loading...

More Telugu News