: హైదరాబాదులో చిచ్చు పెట్టేందుకే జగన్ సభ: కేటీఆర్
వైఎస్సార్సీపీ ఈ నెల 26న హైదరాబాదులో సమైక్య శంఖారావం సభ జరపనుండగా, టీఆర్ఎస్ ఎమ్మెల్యే కె.తారకరామారావు తీవ్రంగా స్పందించారు. ప్రశాంతంగా ఉన్న హైదరాబాదులో చిచ్చు పెట్టేందుకు జగన్ సభ అని దుయ్యబట్టారు. కరీంనగర్ లో నేడు మీడియాతో మాట్లాడుతూ, జగన్ ఇరు ప్రాంతాలకు సమన్యాయం అంటూ మాట్లాడడం నవ్వు తెప్పిస్తోందని అన్నారు. ఆయన సొంత పార్టీ నేతలకే న్యాయం చెయ్యలేకపోయాడని విమర్శించారు.