: నాలుగు లక్షల మందిపై ఫైలిన్ తుపాను ప్రభావం


శ్రీకాకుళం జిల్లాలో ఫైలిన్ తుపాను భారీగా ప్రభావం చూపింది. ఈ ప్రభావం నాలుగు లక్షల మందిపై పడిందని జిల్లా కలెక్టర్ సౌరభ్ గౌర్ ప్రకటించారు. పైలిన్ తుపాను వెలిసిన వారం రోజుల తర్వాత అధికారులు నష్టాలను అంచనా వేశారు. ఎక్కడా ప్రాణనష్టం జరగలేదని చెప్పారు. 382 ఇళ్లు పూర్తిగా, 800 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని, పన్నెండు వందల విద్యుత్ స్థంభాలు ధ్వంసమైనట్లు తెలిపారు. ఇక 442 గ్రామాలు తుపాను ధాటికి గురవగా, తొమ్మిదివేల హెక్టార్లలో పంట పొలాలు నాశనమయ్యాయని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News