: అసోంలో కాల్పులు.. ఒకరి మృతి


అసోంలోని మోరిగాం జిల్లా బోరిబజార్ పోలీస్ అవుట్ పోస్టుపై ప్రజలు దాడి చేశారు. వారిని అదుపు చేయడానికి పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందగా ఇద్దరు గాయపడినట్టు సమాచారం. గురువారం స్థానికంగా జరిగిన ఒక ఫుట్ బాల్ మ్యాచ్ సందర్భంగా రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణకు కారణమైన ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో, అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలంటూ స్థానికులు పోలీసు స్టేషన్ మీద దాడికి దిగారు. ఈ నేపథ్యంలోనే కాల్పులు చోటు చేసుకున్నాయి.

  • Loading...

More Telugu News