: మొహాలీలోనూ పరుగుల పండుగే..


భారత్, ఆసీస్ జట్ల మధ్య ఏడు వన్డేల సిరీస్ లో భాగంగా ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచ్ లలోనూ పరుగులు వెల్లువెత్తాయి. ముఖ్యంగా జైపూర్ ఆతిథ్యమిచ్చిన రెండో వన్డేలో బ్యాట్స్ మెన్ పండుగ చేసుకున్నారు. బౌండరీలతో హోరెత్తించారు. కాగా, మూడో వన్డేకు వేదిక అయిన మొహాలీలోని పీసీఏ స్టేడియం కూడా బ్యాటింగ్ స్వర్గధామమే. ఇక్కడి పిచ్ కూడా కఠినంగా ఉండి, స్థిరమైన బౌన్స్ లభిస్తుందని, తద్వారా బంతి బ్యాట్ పైకి వస్తుందని పిచ్ క్యూరేటర్ దల్బీర్ సింగ్ తెలిపారు.

ఇటీవల ఇక్కడ జరిగిన చాంపియన్స్ లీగ్ టి20 టోర్నీ మ్యాచ్ లలోనూ భారీ స్కోర్లు నమోదయ్యాయని దల్బీర్ చెప్పారు. జైపూర్లో ఏం జరిగిందో ఇక్కడా అదే ఆశించవచ్చని పేర్కొన్నారు. అయితే, సాయంత్రం పూట ఇక్కడ తేమ ఉంటుందని, దీంతో, టాస్ కీలకం కానుందని దల్బీర్ అభిప్రాయపడ్డారు. ఇక మ్యాచ్ సందర్భంగా మైదానంలో గడ్డిపై తేమను తొలగించేందుకు తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ డే-నైట్ మ్యాచ్ రేపు మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు ఆరంభం అవుతుంది.

  • Loading...

More Telugu News