: పన్ను ఎగ్గొడితే క్షమించం: చిదంబరం
దేశ ఆర్థిక రంగ వృద్ధిని ప్రోత్సహించే దిశగా మరిన్ని చర్యలు తీసుకుంటామని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం చెప్పారు. పన్ను ఎగవేతదారులను క్షమించే ప్రసక్తే లేదన్నారు. తమ దగ్గర చాలా మంది జాబితా ఉందని హెచ్చరించారు. ఆదాయాన్ని దాచవద్దని పన్ను చెల్లించమని చిదంబరం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పార్లమెంటు ప్రస్తుత సమావేశాలలోనే బీమా, పింఛను బిల్లులు ఆమోదం పొందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.