: క్వార్టర్స్ కు దూసుకెళ్ళిన సైనా
డెన్మార్క్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్ క్వార్టర్ ఫైనల్ కు దూసుకెళ్ళింది. రెండో రౌండ్లో సైనా 21-12, 21-7తో స్కాట్లాండ్ అమ్మాయి క్రిస్టీ గిల్మోర్ పై విజయం సాధించింది. సైనా కేవలం అరగంటలోనే తన ప్రత్యర్థిని చిత్తు చేయడం విశేషం. ఇక, పురుషుల విభాగంలో పారుపల్లి కశ్యప్ 11-21, 15-21తో డెన్మార్క్ కు చెందిన జాన్ జార్గెన్సన్ చేతిలో ఓటమిపాలయ్యాడు. కాగా, కశ్యప్, జార్గెన్సన్ ఐబీఎల్ లో బంగాబీట్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరో రెండో రౌండు మ్యాచ్ లో గురుసాయి దత్ 21-15, 21-16తో సహచరుడు అజయ్ జయరామ్ పై నెగ్గి క్వార్టర్స్ లో ప్రవేశించాడు.