: 171కి చేరిన ఫిలిప్పీన్స్ భూకంప మృతుల సంఖ్య


గత మంగళవారం ఫిలిప్పీన్స్ లో సంభవించిన భూకంపంలో చనిపోయిన వారి సంఖ్య 171కి చేరుకుంది. మరో 20 మంది ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు. భూకంపాన్ని ప్రత్యక్షంగా చూసినవారు పునరావాస కేంద్రాల్లో ఉండటానికి కూడా భయపడుతున్నారు. వీరంతా సాధ్యమైనంత వరకు బహిరంగ ప్రదేశాల్లోనే ఉంటున్నారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ దుర్ఘటనలో మొత్తం 34 వేల ఇళ్లు నేలమట్టమయ్యాయి. దాదాపు 35 లక్షల మంది భూకంప బాధితులుగా మిగిలారు.

  • Loading...

More Telugu News