: శిల్పాశెట్టి ఇంట్లో దొంగతనం
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి ఇంట్లో దొంగతనం జరిగింది. కొన్ని రోజుల క్రితం ముంబైలోని ఆమె నివాసంలోకి ప్రవేశించిన దొంగలు ఖరీదైన మ్యూజిక్ సిస్టం, ఐపాడ్ను ఎత్తుకెళ్లినట్లు సమాచారం. దొంగతనంపై ఈ నెల 16న శిల్పా మేనేజర్ నుంచి పోలీసులకు ఫిర్యాదు అందింది. ఇప్పటిదాకా పోలీసులు ఎవరినీ అరెస్ట్ చేయలేదు. దొంగతనం జరిగిన సమయంలో శిల్పా, ఆమె భర్త రాజ్ కుంద్రా ఇంట్లో ఉన్నారా, లేదా? అన్నది తెలియరాలేదు.