: ఐఫోన్ కోసం కూతురు విక్రయం


చైనాలో ఒక యువజంట ఐఫోన్ పై పిచ్చితో దాన్ని కొనుక్కోవాలని ముచ్చటపడింది. కానీ, అంత డబ్బు లేదు. దాంతో కన్నకూతురునే విక్రయించారు. అదీ కూడా ఆన్ లైన్లో దత్తత పేరుతో ప్రకటనలు ఇచ్చి మరీ సంతలో బొమ్మలా అమ్మేశారు. వీరు కచ్చితంగా ఎంతకు విక్రయించారన్నదీ తెలియరాలేదు కానీ, ప్రకటనల్లో మాత్రం 30 లక్షల రూపాయల నుంచి 45 లక్షల రూపాయల వరకూ విక్రయ ధరగా పేర్కొన్నారు.

కుమార్తెను అమ్మగా వచ్చిన పైసలతో తల్లి ఐఫోన్, స్పోర్ట్స్ షూ, ఇతర వస్తువులు కొనుక్కుంది. కానీ, పోలీసుల ఆరోపణలను ఆ జంట ఖండిస్తోంది. తమకు ముగ్గురు సంతానం అని, మూడో పాప బంగారు భవిష్యత్తు కోరుకునే అలా చేశామంటూ తప్పించుకోజూస్తున్నారు. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. చైనీయులలో ఐఫోన్లంటే తెగ క్రేజ్ ఉంది. గతంలో ఇలానే ఐఫోన్ పిచ్చిపై ఒక టీనేజర్ కిడ్నీ అమ్ముకున్నాడు.

  • Loading...

More Telugu News