: చత్తీస్ గఢ్ ఎన్నికల్లో పేలుళ్లకు మావోయిస్టుల ప్రణాళిక
చత్తీస్ గఢ్ లో త్వరలో జరగనున్న ఎన్నికల సమయంలో పంజా విసిరేందుకు మావోయిస్టులు సిద్ధమైనట్టు తెలుస్తోంది. మావోల ప్రాబల్యం ఎక్కువగా ఉండే బస్తర్ జిల్లాలో పోలింగ్ బూతుల సమీపంలో మందుపాతరలను అమర్చినట్టు సమాచారం అందడంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. దీంతో, భద్రతాదళాలు చత్తీస్ గఢ్ లోని దక్షిణాది జిల్లాల్లో మందుపాతరలను గుర్తించి వాటిని నిర్వీర్యం చేసేపనిలో పడ్డాయి. ఎన్నికల సందర్భంగా పోలీసులు, పోలింగ్ సిబ్బందిపై మావోలు దాడిచేసే అవకాశాలు ఉండటంతో భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు.