: విభజనకు 'ఆర్టికల్ 371 డి' ఆటంకం కాదు: వినోద్
రాష్ట్ర ఏర్పాటుకు ఆర్టికల్ 371 డి ఆటంకం కాదని టీఆర్ఎస్ నేత వినోద్ అన్నారు. దీన్నొక సాకుగా చూపి రాష్ట్ర ఏర్పాటును ఎవరూ అడ్డుకోలేరని హైదరాబాదులోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు. 371 డి ఆర్టికల్ కు సవరణ చేయనంతవరకు విభజన జరగదని సీమాంధ్ర నేతలు చెబుతున్నారన్న వినోద్.. వారి మాటలను తప్పుబట్టారు.