: 'మోడీ గోబ్యాక్'.. చెన్నైలో విద్యార్థుల ధర్నా


బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ తమిళనాడు పర్యటన ఉద్రిక్తతకు దారితీసింది. చెన్నైలో మోడీ రాకను వ్యతిరేకిస్తూ విద్యార్థి సంఘాలు ధర్నా నిర్వహించాయి. దీంతో, పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఆగ్రహం చెందిన విద్యార్థులు వారిపై రాళ్లు రువ్వడంతో పరిస్థితి అదుపుతప్పింది. దీంతో, పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. కాగా, నిఘా విభాగం హెచ్చరికలతో బీజేపీ కార్యాలయం, విమానాశ్రయానికి ఐదంచెల భద్రత కల్పిస్తున్నారు. నేడు మోడీ బీజేపీ తమిళనాడు రాష్ట్ర శాఖ ఏర్పాటు చేయనున్న కార్యక్రమాల్లో పాల్గొనున్నారు.

  • Loading...

More Telugu News