: బంగారం వెలికితీతపై పిటిషన్.. విచారణకు సుప్రీం సమ్మతి


ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావో జిల్లా దాండియా ఖేరా గ్రామంలో బంగారం అన్వేషణ పనులు కోర్టు పర్యవేక్షణలో జరగాలంటూ ఒక న్యాయవాది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విలువైన బంగారం నిల్వలున్నాయి గనుక, అన్వేషణ కార్యక్రమం కోర్టు పర్యవేక్షణలోనే జరగాలని కోరుతూ న్యాయవాది ఎంఎల్ శర్మ ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. అయితే, ఈ బాధ్యతలను చూడడానికి ప్రభుత్వం ఉందని కోర్టు పేర్కొంది. అయినా పిటిషన్ పై విచారణకు అంగీకరిస్తూ.. తప్పులు లేకుండా మళ్లీ పిటిషన్ దాఖలు చేయాలని ఆదేశించింది. మరోైవైపు దాండియా ఖేరా గ్రామంలో కోటలో బంగారం అన్వేషణ పనులను భారత భూభౌతిక సర్వే సిబ్బంది పూజల అనంతరం ప్రారంభించారు.

  • Loading...

More Telugu News