: తెలంగాణను ముంచే పోలవరాన్ని అడ్డుకుంటాం: హరీశ్ రావు
తెలంగాణను ముంచేసే పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకుని తీరుతామని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు స్పష్టం చేశారు. డెల్టాలో మూడవ పంటకు నీరివ్వడం కోసం తెలంగాణలోని మూడు లక్షల ఎకరాలను ముంచడానికి, లక్షలాది మంది నిరాశ్రయులను చేయడానికి చూస్తున్నారని ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా ట్రాన్స్ ట్రాయ్ కంపెనీకే ప్రభుత్వం కాంట్రాక్టు కట్టబెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టుతో తెలంగాణలోని గిరిజనులు నష్టపోతారని చెప్పారు.