: పోలవరం పనులు సత్వరం ప్రారంభించండి: సీఎం
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ కాంట్రాక్టును ట్రాన్స్ ట్రాయ్ కు అప్పగిస్తూ హై పవర్ కమిటీ తీసుకున్న నిర్ణయానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ ఆమోదముద్ర వేశారు. వెంటనే పోలవరం నిర్మాణ పనులను ప్రారంభించాలని ఆదేశించారు. పనులు పూర్తయితే జూన్ లోనే ఆంధ్రకు నీరు ఇచ్చే అవకాశం ఉంటుందన్నారు.
అలాగే ఈ ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణ, రాయలసీమ ప్రాంతాలకు 45 టీఎంసీల నీరు ఇవ్వవచ్చని, తుఫాను సమయాలలో వచ్చే వరద నీటి నష్టాలను అరికట్టడానికి వీలు కలుగుతుందని చెప్పారు. ఖమ్మం జిల్లాలో రెండు లక్షల ఎకరాలను సాగులోకి తేవచ్చన్నారు.