: లైంగిక నేరాల చట్టానికి అందరూ సహకరించాలి: చిదంబరం
లైంగిక నేరాలపై చట్టం రూపకల్పనకు పార్లమెంటులో అందరూ సహకరించాలని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం కోరారు. మహిళలపై లైంగిక నేరాలకు పాల్పడడం తీవ్రమైన సమస్య అన్నారాయన. ఈ చట్టం విషయంలో అందరూ విశాల దృక్పథంతో వ్యవహరించాలని ఆయన సూచించారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన చిదంబరం.. జస్టిస్ వర్మ కమిటీ సిఫార్సులను తిరస్కరించామనడం సరికాదన్నారు. లైంగిక నేరాలపై సత్వరమే కొత్త చట్టం అవసరమని గుర్తించామనీ, అందుకే ఆర్డినెన్స్ తెచ్చామనీ చిదంబరం వెల్లడించారు. కాగా, ఈ బిల్లు స్థాయీ సంఘం పరిశీలనలో వుందని సమాచార, ప్రసార శాఖ మంత్రి మనీష్ తివారీ చెప్పారు.