: ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ కు తప్పిన ఘోర ప్రమాదం


విజయవాడ నుంచి సికింద్రాబాద్ బయలుదేరిన ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ కు పెను ప్రమాదం తప్పింది. గుంటూరు జిల్లా మంగళగిరి వద్దకు రాగానే... రైలు బోగీలకు, ఇంజిన్ కు మధ్య లింక్ తెగిపోయింది. ఆ సమయంలో ఓ మలుపు వద్ద రైలు నెమ్మదిగా వెళుతోంది. దీంతో ఘోర ప్రమాదం తప్పింది. విషయం తెలిసిన ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన ఉదయం 4.20 గంటలకు సంభవించింది. మరమ్మత్తుల అనంతరం 6.40 గంటలకు రైలు సికింద్రాబాద్ బయలుదేరింది.

  • Loading...

More Telugu News