: ఆడవారే ఎక్కువ కష్టపడుతున్నారట!


మగవారితో పోల్చుకుంటే ఆడవారే ఎక్కువగా కష్టపడుతున్నారట. ఈ విషయం ప్రత్యేక అధ్యయనంలో వెల్లడైంది. అందునా ముఖ్యంగా వ్యవసాయ రంగంలో ఆడవారే అధికంగా కష్టం చేస్తున్నారని తాజా అధ్యయనంలో తేలింది. భూమిని దున్నడంనుండి చక్కగా పంటలను పండించి, పంటను ఇంటికి చేర్చడం వరకూ ఇలా అన్ని పనులకు సంబంధించి ఎక్కువగా కష్టం చేసేది మగువలేనట. ఆడవారితో పోల్చుకుంటే మగవారు తక్కువ కష్టం చేస్తారని ఒక సంస్థ నిర్వహించిన అధ్యయనంలో తేలింది.

మన దేశం వ్యవసాయ ప్రధానమైన దేశం. ఈ రంగంలోని పనులకు సంబంధించి మహిళలే ఎక్కువగా వాటాను కలిగివున్నారని, వీరు పురుషులతో పోల్చుకుంటే 80 శాతం వాటాను కలిగివున్నారని ఈ సర్వేలో తేలింది. దేశంలోని కొన్ని కోట్లమంది మహిళలు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వ్యవసాయ రంగంలో కీలకమైన పాత్రను పోషిస్తున్నారని, పాడి పరిశ్రమలో అయితే మహిళల వాటా తొంభై శాతంగా ఉందని ఈ సర్వేలో తేలింది. అలాగే పురుషులు సగటున 1800 గంటలపాటు కష్టపడుతుండగా, మగువలు మాత్రం సగటున 3,300 గంటలపాటు వ్యవసాయ రంగంలో కష్టపడుతున్నారని ఈ సర్వే వెల్లడించింది. వ్యవసాయ రంగంలో మగువలు ఇంతగా కష్టపడుతున్నా మగువల్లో భూమిపై హక్కు ఉన్నవారి శాతం మాత్రం 13 శాతమేనని ఈ అధ్యయనం చెబుతోంది. ఎంతగా కష్టం చేసినా హక్కుల్లో మాత్రం ఆడవారికి అన్యాయమే జరుగుతోందని ఈ సర్వే చెబుతోంది.

  • Loading...

More Telugu News