: గాలిద్వారా క్యాన్సరొస్తుందా...!


క్యాన్సర్‌ వ్యాధికి పలు కారణాలను చెప్పవచ్చు. కానీ మనం పీల్చేగాలి ద్వారా కూడా క్యాన్సరు వస్తుందా అంటే... అవుననే పరిశోధకులు చెబుతున్నారు. దీంతో ఆశ్చర్యంతో మనం నోరెళ్లబెట్టాల్సి వస్తోంది. మనం పీల్చేగాలిలోని కాలుష్యం క్యాన్సర్‌కు కారణమవుతోందని పరిశోధకుల అధ్యయనంలో రుజువయింది.

క్యాన్సర్‌ పరిశోధనకు సంబంధించి నిర్వహించిన ఒక సదస్సులో నిపుణులు పలు అంశాలను ప్రస్తావించారు. ఈ సదస్సులో కలుషితమైన గాలి కారణంగా క్యాన్సర్‌ వ్యాధి వచ్చే అవకాశాలున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. వాయుకాలుష్యం ఊపిరితిత్తులు, ఉదరకోశ క్యాన్సర్‌కు కారణమయ్యే అవకాశాలున్నట్టు ఈ సంస్థ పేర్కొంది. ఇప్పటి వరకూ డీజిల్‌ ఇంజిన్ల పొగ, కొన్ని రకాల అవక్షేపాలు, దుమ్ము, ధూళి, లోహాలు వంటివి మాత్రమే క్యాన్సర్‌కు కారణమవుతాయని అనుకునేవారని, కానీ ఇప్పుడు ఇంటి వెలుపలి వాతావరణంలోని కలుషితమైన గాలి కూడా క్యాన్సర్‌ వ్యాధిని మోసుకొస్తున్నట్టు రుజువైందని నిపుణులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News