: పరేఖ్ ఇంట్లో సోదాలను ఖండించిన జేపీ
నేరపరిశోధనా సంస్థలు పిచ్చోడి చేతిలో రాయిలా మారకూడదని లోక్ సత్తా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ అన్నారు. నిజాయతీ కలిగిన విశ్రాంత ఐఏఎస్ అధికారి పరేఖ్ ఇంట్లో సీబీఐ సోదాలు చేయడాన్ని జేపీ తీవ్రంగా ఖండించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, దేశంలో పరిశోధనా సంస్థలకు స్వతంత్ర ప్రతిపత్తి కావాలని కోరిన తమలాంటివారు సీబీఐ చర్యల పట్ల ఆలోచనలో పడినట్లు చెప్పారు. పరేఖ్ తో తనకు 25 ఏళ్లుగా పరిచయం ఉందని, ఎలాంటి అవినీతి మచ్చ లేకుండా పనిచేసిన అధికారిగా ఆయనకు మంచి పేరు ఉందని జేపీ తెలిపారు. ప్రభుత్వం సీబీఐని ఓ పావుగా వాడుకుంటున్న తీరుపై కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సీబీఐ చేసిన తప్పును సరిదిద్దుకుని పరేఖ్ పై పెట్టిన కేసులు విరమించుకోవాలని జేపీ డిమాండ్ చేశారు.