: ప్రణబ్ ప్రధాని అయినా దేశం ఇంత నష్టపోయేది కాదు: మోడీ
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలలో చివరి రోజైన నేడు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలతో విరుచుకుపడ్డారు. ప్రధానమంత్రి పదవిలో నైట్ వాచ్ మన్ ను కూర్చోబెట్టారని మోడీ కటువైన వ్యాఖ్య చేశారు. ప్రణబ్ ముఖర్జీ ప్రధాని అయ్యి ఉంటే దేశానికి ఇంత నష్టం జరిగేది కాదన్నారు. కేంద్ర ప్రభుత్వ చెత్త పాలనను సహించబోమని చెప్పారు.
భారత్ ముందుకెళ్లడానికి అన్ని రకాల అవకాశాలున్నా.. ఆ దిశగా దేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కాంగ్రెస్ విఫలమైందన్నారు. కాంగ్రెస్ పాలనలో దేశం ముందుకెళ్లలేదని తేల్చి చెప్పారు. దేశాన్ని కాంగ్రెస్ పూర్తిగా ముంచేసిందని, పేదలు తినడానికి తిండి కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ను విసిరి పారేయడానికి దేశం సిద్ధమైందని మోడీ అన్నారు. బీజేపీ ఒక్కటే కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయమని చెప్పారు. గుజరాత్ లో మూడోసారి విజయం బీజేపీ సిద్ధాంతానికి లభించిన గెలుపుగా చెప్పారు. అధికారంలోకి వస్తే దేశ ప్రజలకు బీజేపీ తమ వంతుగా సేవ చేస్తుందన్నారు.