: దక్షిణాఫ్రికాపై పాకిస్థాన్ జయభేరి


తటస్థ వేదిక అబుదాబిలో జరుగుతున్న తొలి టెస్టులో పాకిస్థాన్ జట్టు 7 వికెట్ల తేడాతో వరల్డ్ నెంబర్ వన్ దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ లో 249 పరుగులు చేయగా, పాకిస్థాన్ 442 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ లో సఫారీలను 232 పరుగులకే కట్టడి చేయడంతో పాక్ ముందర 40 పరుగుల స్వల్ప లక్ష్యం నిలిచింది. ఈ లక్ష్యాన్ని పాక్ మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ విజయంతో పాక్ రెండు టెస్టుల సిరీస్ లో 1-0తో ముందంజ వేసింది. పాక్ తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ సాధించిన యువ ఓపెనర్ ఖుర్రమ్ మంజూర్ (146) కు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' లభించింది.

  • Loading...

More Telugu News