: కన్నడ హీరో రాఘవేంద్ర రాజ్ కుమార్ కు తీవ్ర అనారోగ్యం
కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ తనయుడు, హీరో రాఘవేంద్ర రాజ్ కుమార్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో, కుటుంబ సభ్యులు ఆయనను ఈ ఉదయం బెంగళూరులోని కొలంబియా ఆసియా ఆసుపత్రిలో చేర్చారు. మెదడులో రక్తం గడ్డకట్టిందని వైద్యులు తెలిపినట్టు రాఘవేంద్ర సోదరుడు శివరాజ్ కుమార్ వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆయన చెప్పారు.