: పాకిస్థానీ గాయకుడు అద్నాన్ సమీ వీసా గడువు పెంపు


పాకిస్థాన్ కు చెందిన గాయకుడు, సంగీత దర్శకుడు అద్నాన్ సమీ వీసా గడువును భారత హోం మంత్రిత్వ శాఖ మరో మూడు నెలల పాటు పొడిగించింది. ఈ వివరాలను ముంబై డిప్యూటీ పోలీస్ కమిషనర్ సంజయ్ షింత్రే తెలిపారు. గత కొద్ది సంవత్సరాలుగా అద్నాన్ సమి ముంబైలో నివాసముంటున్నారు. ఆయన వీసా గడువు అక్టోబరు 6 వ తేదీన ముగిసిపోయింది. దీంతో, ఆయన భారత్ లో ఉండటం వివాదాస్పదమయింది. దేశం విడిచి వెళ్ళాలంటూ ముంబయి పోలీసులు ఆయనకు సమన్లు కూడా జారీ చేశారు.

  • Loading...

More Telugu News