: సమ్మె విరమిస్తున్నాం.. తాత్కాలికంగానే: అశోక్ బాబు
ముఖ్యమంత్రితో చర్చలు సఫలమయ్యాయని, ఆ మేరకు తాత్కాలికంగా సమ్మెను విరమిస్తున్నామని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు చెప్పారు. సీఎంతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, సమ్మెను విరమించాలని సీఎం తమను కోరారని చెప్పారు. ఆయన తమ సమస్యలు అర్థం చేసుకున్నారని, తన పరిధి మేరకు హామీ ఇవ్వగలనని చెప్పారని వెల్లడించారు. తాను పూర్తిగా సమైక్యవాదినే అని సీఎం స్పష్టం చేశారని అశోక్ బాబు తెలిపారు. అసెంబ్లీకి తీర్మానం వస్తే తాము మరలా సమ్మె బాట పడతామని సీఎంతో చెప్పగా.. ఆ అవసరం ఉండబోదని ఆయన అన్నారని అశోక్ బాబు వివరించారు. అసెంబ్లీలో తీర్మానాన్ని ఓడించేందుకే ప్రయత్నిస్తామని సీఎం స్పష్టం చేశారని ఆయన చెప్పారు.