: హైదరాబాదును యూటీ చేయాలి: రాయపాటి


రాష్ట్ర విభజన తప్పదనుకుంటే... హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతం (యూటీ) కానీ, లేదా, దేశ రెండో రాజధాని కానీ చేయాలని ఎంపీ రాయపాటి సాంబశివరావు అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... తమ రాజీనామాలు ఆమోదిస్తే సంతోషమని లేకపోతే పార్లమెంటులో బిల్లును వ్యతిరేకిస్తామని తెలిపారు. ఎంపీలమంతా నైతిక బాధ్యతతో రాజీనామాలు చేశాం తప్ప ఒత్తిడి వల్ల కాదని అన్నారు. జగన్ తో కాంగ్రెస్ కు లోపాయకారీ ఒప్పందం ఉందన్న సంగతి తనకు తెలియదని అన్నారు. ఒప్పందం కుదరి ఉంటే వైఎస్సార్సీపీ విభజనను వ్యతిరేకించేది కాదని చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News