: పిటిషన్ ఉపసంహరించుకోమని లగడపాటిని కోరిన కమల్ నాథ్
స్పీకర్ ఫార్మాట్ లో సీమాంధ్ర ఎంపీలు రాజీనామాలు చేసినా ఆమోదించడం లేదంటూ ఢిల్లీ హైకోర్టులో వేసిన పిటిషన్ ను ఉపసంహరించుకోవాలని ఎంపీ లగడపాటి రాజగోపాల్ ను కేంద్రమంత్రి కమల్ నాథ్ కోరారు. ఈ సూచన మేరకు పిటిషన్ ను లగడపాటి వెనక్కి తీసుకుంటారని తెలుస్తోంది. మరోవైపు, రాజీనామాలపై త్వరలో నిర్ణయం తీసుకుంటానని స్పీకర్ మీరాకుమార్ ఈ ఉదయం సెక్రటరీ జనరల్ ద్వారా లగడపాటికి సమాచారం ఇచ్చిన సంగతి తెలిసిందే.