: రాష్ట్రపతి బంగ్లాదేశ్ పర్యటన నేడే
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నేటి నుంచి మూడు రోజుల పాటు బంగ్లాదేశ్ లో పర్యటించనున్నారు. మధ్నాహ్నం 12.30 గంటలకు ప్రణబ్ ఢాకా చేరుకుంటారు. బంగ్లాదేశ్ అధ్యక్షుడు జిల్లూర్ రెహ్మాన్, ప్రధాని షేక్ హసీనా విపక్ష నేత ఖలీదా జియాలతో పలు అంశాలపై చర్చలు జరుపుతారు. రాష్ట్రపతిగా ప్రణబ్ కు ఇది తొలి విదేశీ పర్యటన. బంగ్లాదేశ్ లో అల్లర్లు జరుగుతున్న సమయంలోనే రాష్ట్రపతి పర్యటిస్తుండడంతో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు.