: టీఆర్ఎస్ 16 ఎంపీ సీట్లు గెలుచుకుంటుంది: ఈటెల
తెలంగాణ ప్రాంతంలో తమ పార్టీ 16 ఎంపీ సీట్లను గెలుచుకుంటుందని అంటున్నారు టీఆర్ఎస్ నేత ఈటెల రాజేందర్. తాజాగా వెలువడిన సర్వేల ఫలితాలు టీఆర్ఎస్ పై ప్రజలకున్న అభిమానాన్ని తెలుపుతున్నాయని అన్నారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, గతంలో వచ్చిన ఐదు సర్వేలు కూడా ఇదే ఫలితాలను వెల్లడించాయన్నారు. ఉద్యమాలతో పాటు రాజకీయ ప్రక్రియద్వారా తెలంగాణ సాధించవచ్చని టీఆర్ఎస్ నిరూపించిందన్నారు. తెలంగాణ వచ్చిందని సరిపెట్టుకోకుండా రాష్ట్ర పునర్నిర్మాణంలో తమ పార్టీ క్రియాశీలకంగా వ్యవహరిస్తుందని ఆయన అన్నారు.