: గోధుమల మద్దతు ధర పెంచిన కేంద్రం
గోధుమ సాగు రైతులకు ప్రయోజనం కలిగించేలా కనీస మద్దతు ధరను కేంద్ర ప్రభుత్వం పెంచింది. మద్దతు ధర 50 రూపాయలు పెంచడంతో క్వింటాలు ధర 1400 రూపాయలకు చేరింది. వ్యవసాయ ధరల నిర్ణయ కమిటీ సూచనల ప్రకారమే ప్రభుత్వం పెంపు నిర్ణయం తీసుకుంది. అయితే, వ్యవసాయ శాఖ క్వింటాలుకు మద్దతు ధరను 100 రూపాయలు పెంచాలని కోరగా.. ప్రభుత్వం రూ.50 పెంపుకే మొగ్గు చూపింది. ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్ర మంత్రి థామస్ చెప్పారు. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వ ఆహార సబ్సిడీ భారం కూడా పెరిగిపోనుంది. అయితే, రబీ సీజన్ ముందు ప్రభుత్వం మద్దతు ధర పెంచడంతో రైతులకు ప్రయోజనం చేకూరనుంది.