: నవంబర్ 6 నుంచి దక్షిణ భారత మహిళల కబడ్డీ పోటీలు
కృష్ణా జిల్లా నందిగామ కేవీఆర్ కళాశాలలో నవంబర్ 6 నుంచి 10 వరకు భారత అంతర విశ్వవిద్యాలయాల మహిళల కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నట్టు కృష్ణా యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య వెంకయ్య వెల్లడించారు. యూనివర్సిటీలో ఆయన మాట్లాడుతూ, 5 రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాల నుంచి 40 జట్లు పోటీలకు హాజరవుతాయని తెలిపారు. 15 లక్షల రూపాయలతో ఈ పోటీలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు.