: శబరిమల ఆలయ ప్రధాన పూజారిగా పీఎన్ నారాయణన్
శబరిమలలోని అయ్యప్ప ఆలయ ప్రధాన పూజారి(మెల్ శాంతి)గా పీఎన్ నారాయణన్ ఎంపికయ్యారు. ఆయన ఎర్నాకుళం జిల్లా, కొత్తమంగళం పరిధిలోని త్రిక్కరియూర్ గ్రామానికి చెందినవారు. అలాగే, శబరిమలలోని మల్లికాపురం దేవి ఆలయ ప్రధాన పూజారిగా పీఎం మనోజ్ నియమితులయ్యారు. వీరిని లాటరీ ద్వారా ట్రావెన్ కూర్ దేవస్థానం బోర్డు ఈ రోజు ఎంపిక చేసింది. వీరు ఏడాది పాటు సేవలు అందించాల్సి ఉంటుంది. ప్రధాన పూజారులు ఏడాది కాలంపాటు శబరిమలలోని ఆలయ పరిసరాల్లోనే నివసించడమనేది ఆచారంగా వస్తోంది. అయ్యప్ప దీవెనల వల్లే తమకు సేవ చేసుకునే అదృష్టం లభించిందని ఇద్దరూ సంతోషాన్ని వ్యక్తం చేశారు.