: రక్తంలో గడ్డలను గుర్తించే మూత్ర పరీక్ష


రక్తంలో గడ్డలను వెంటనే గుర్తించకపోతే ప్రాణాలకే ప్రమాదం. పక్షవాతంతో మంచానికి పరిమితం కావడం లేదా గుండెపోటు వచ్చి ప్రాణం పోయే ముప్పు వీటి వల్ల ఉంటుంది. ఇంతటి ప్రమాదకరమైన గడ్డలను సులభంగా తెలుసుకునేందుకు పరిశోధకులు ఒక మూత్ర పరీక్షను అభివృద్ధి చేశారు. పరిశోధకుల్లో భారత సంతతికి చెందిన సంగీత ఎన్ భాటియా కూడా ఉన్నారు. ప్లేట్ లెట్లు, ఫిబ్రిన్ ప్రొటీన్లు కలిసి రక్తంలో గడ్డలుగా ఏర్పడుతుంటాయి. ఇవి రక్తప్రసారానికి అడ్డుపడడం వల్ల పక్షవాతం, గుండెపోటు తదితర ప్రమాదాలు పొంచి ఉంటాయి. వీటిని గుర్తించేందుకు మూత్ర పరీక్షను అభివృద్ధి చేసి ఎలుకలపై ప్రయోగించగా మంచి ఫలితాలు కనిపించాయి. దీన్ని మానవులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు మరింత పరిశోధన సాగించాల్సి ఉంది.

  • Loading...

More Telugu News