: ముంబయి క్రికెట్ సంఘం పగ్గాలు చేపట్టనున్న శరద్ పవార్
ఐసీసీ మాజీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి శరద్ పవార్ మళ్ళీ క్రికెట్ వ్యవహారాల్లోకి ప్రవేశించనున్నారు. ముంబయి క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా ఆయన పగ్గాలు చేపట్టనున్నారు. ఈ పదవికి ఆయన ఏకగ్రీవంగా ఎన్నికవడం ఇక లాంఛనమే. ఈ పదవికి మహారాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి గోపీనాథ్ ముండే కూడా నామినేషన్ వేయగా, నివాస ధ్రువీకరణ పత్రాలు సరిలేవంటూ ఆయన నామినేషన్ ను ఎన్నికల అధికారి తిరస్కరించారు. దీంతో, బరిలో మిగిలింది శరద్ పవార్ ఒక్కరే. కాగా, తన నామినేషన్ తిరస్కరణకు గురికావడంపై ముండే ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని వెనుక కుట్ర ఉందని ఆరోపించారు.