: 103 ఏళ్ల వరుడు.. 99 ఏళ్ల వధువు
పళ్లు రాలిపోయే వయసు. అడుగు తీసి అడుగు వేయాలంటే మరొకరి సహకారం ఉండాల్సిందే. అలాంటి వృద్ధులు ఇద్దరు పెళ్లి ముచ్చట తీర్చుకున్నారు. పరాగ్వేలోని శాంటారోసా డెల్ అగురేకు చెందిన వరుడు జోస్ మాన్యూల్ రెల్లాకు 103 ఏళ్లు. వధువు మార్టినా లోపెజ్ కు 99 ఏళ్ల వయసు. ఎప్పుడో 80 ఏళ్ల క్రితమే వీరు సివిల్ మ్యారేజి చేసుకున్నారు. కానీ, మత సంప్రదాయాల ప్రకారం చేసుకోలేదు. ఇంత లేటు వయసులో తమ మత సంప్రదాయాలకు అనుగుణంగా పునర్వివాహం చేసుకున్నారు. వీరికి ఎనిమిది మంది సంతానం. 50 మంది మనవళ్లు, మనవరాళ్లు. 35 మంది ముని మనవళ్లు, మనవరాళ్లు, 20 మంది ముని ముని మనవళ్లు, మనవరాళ్లు కూడా ఉన్నారు.