: పురంధేశ్వరి ఆ బ్లూప్రింట్ ను బయటపెట్టాలి: ఉమ
ప్రధానికి ఇచ్చిన బ్లూప్రింట్ ను కేంద్ర మంత్రి పురంధేశ్వరి బయటపెట్టాలని టీడీపీ ఎమ్మెల్యే దేవినేని ఉమ డిమాండ్ చేశారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, లగడపాటి ఇప్పటికైనా డ్రామాలు ఆపాలని సూచించారు. కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ ఎంపీల అసమర్థత వల్లే రాష్ట్రానికి దుస్థితి పట్టిందని ఆరోపించారు. ముఖ్యమంత్రి ఉద్యోగం కోసం మా పిల్లల ఉద్యోగాలతో ఆడుకుంటారా? అని ఉమ ప్రశ్నించారు.