: తెలుగుజాతి మధ్య చిచ్చు పెట్టకండి: పొన్నాల
సమైక్య సభలతో తెలుగుజాతి మధ్య విద్వేషాలను రెచ్చగొట్టొద్దని మంత్రి పొన్నాల లక్ష్మయ్య హితవు పలికారు. సమైక్యతను దెబ్బతీసే సభలతో తెలుగుజాతికి అపఖ్యాతి తీసుకురావద్దని సూచించారు. వరంగల్ లో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఏర్పాటును అడ్డుకోవడం ఎవరి తరం కాదని ఆయన అన్నారు.