: టీమిండియా అత్యుత్తమ ప్రదర్శనల్లో ఇదొకటి: ధోనీ


జైపూర్ వన్డేలో టీమిండియా రికార్డు స్థాయిలో చేజింగ్ చేయడం పట్ల కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ స్పందించాడు. మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ, టీమిండియా అత్యుత్తమ ప్రదర్శనల్లో ఇది ఒకటని పేర్కొన్నాడు. 360 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం ఆషామాషీ విషయం కాదన్నాడు. 2009లో తాము రాజ్ కోట్ లో 411 పరుగులు సాధించినా, శ్రీలంక జట్టు ఆ టార్గెట్ ను ఛేదించిందని చెప్పుకొచ్చాడు. భారీ స్కోరును దృష్టిలో పెట్టుకోకుండా ఆడాలని బ్యాట్స్ మెన్ కు సూచించానని ధోనీ వెల్లడించాడు. శిఖర్, రోహిత్, కోహ్లీ అద్భుతంగా ఆడారని కితాబిచ్చాడు. ఆ ముగ్గురు దూకుడుగా ఆడుతూనే తమను తాము నియంత్రించుకోవడం గొప్ప విషయమన్నాడు.

  • Loading...

More Telugu News