: భారత ఆహార సంస్థ ఎదుట కార్మికుల ధర్నా


భారత ఆహార సంస్థలో పని చేస్తున్న ఒప్పంద కార్మికులను తొలగించడాన్ని నిరసిస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు అసెంబ్లీ ఎదురుగా ఉన్న భారత ఆహార సంస్థ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని ఆహార సంస్థలో 1977 నుంచి పనిచేస్తున్న కార్మికులను అకారణంగా విధుల నుంచి తప్పించారని సీఐటీయూ నాయకులు ఆరోపించారు. కార్మికులను విధుల్లోకి తీసుకునే వరకు ఆందోళన కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News