: మలాలాకు కెనడా గౌరవ పౌరసత్వం
బాలికల విద్యా హక్కు ఉద్యమకారిణి మలాలా యూసఫ్ జాయ్ కు కెనడా గౌరవ పౌరసత్వం ప్రకటించింది. గతంలో దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా, మయన్మార్ ప్రజాస్వామ్య యోధురాలు అంగ్ సాన్ సూకీలకు ఇలాంటి గౌరవ పౌరసత్వాలు లభించాయి. చిన్న వయసులోనే ఈ పాకిస్థాన్ బాలిక అలాంటి మహామహుల సరసన నిలవనుంది.
బాలికల విద్య కోసం మలాలా తన ప్రాణాలను సైతం లెక్కచేయకపోవడం ద్వారా స్ఫూర్తిదాయకంగా నిలిచారని, ఆమె ధైర్యాన్ని గుర్తిస్తున్నట్లు కెనడా ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. బాలికల విద్యను ప్రచారం చేస్తున్నందుకు గతేడాది అక్టోబర్ లో తాలిబాన్లు మలాలాపై కాల్పులు జరపగా.. ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడిన విషయం తెలిసిందే.