: పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ రాసలీల
అతడో ప్రజాప్రతినిధి. పేరు రాజేశ్ నాయక్. వరంగల్ జిల్లా తొర్రూర్ పంచాయతీకి సర్పంచ్. ప్రజలకు మేలు చేకూర్చే పనులు చేయడం అతడి విధి. కానీ, కర్తవ్య నిర్వహణను మరిచాడు. విలువలను గాలికొదిలేశాడు. పడుచులతో కామాయణాలకు తెరదీశాడు. ఈ కాముక సర్పంచ్ రాసలీలలకు పంచాయతీ కార్యాలయమే వేదిక. ఓరోజు ఇలానే, పట్టపగలు పంచాయతీ కార్యాలయంలో వ్యభిచారం చేస్తుండగా ప్రజలు అతడిని నిలదీశారు. అంతేగాకుండా, అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ఆరంభించారు. రాజేశ్ నాయక్ టీడీపీ మద్దతుదారుడని తెలుస్తోంది.