: తగ్గిపోతున్న కండోమ్ ల వాడకం
అవాంచిత గర్భం, సుఖవ్యాధుల నుంచి రక్షణగా నిలిచే కండోమ్ ల వాడకం దేశంలో తగ్గిపోతోంది. కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం 2006-07లో దేశంలో 2.60 కోట్ల కండోమ్ లు వినియోగమయ్యాయి. 2010-11కు వచ్చేసరికి ఈ సంఖ్య 1.60 కోట్లకు పడిపోయింది. దేశ రాజధాని ఢిల్లీ సహా 21 రాష్ట్రాలలో కండోమ్ ల వాడకం తగ్గినట్లు వెల్లడైంది.
అత్యధికంగా ఛత్తీస్ గఢ్ లో 6.90 లక్షల నుంచి 1.40 లక్షలకు తగ్గిపోగా.. కర్ణాటకలో 3.06 లక్షల నుంచి 2.06 లక్షలకు తగ్గింది. 120 కోట్ల జనాభాగల భారత దేశంలో కండోమ్ ల వాడకానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. అవాంఛిత గర్భ నివారణకు తోడ్పడడం వల్ల వీటితో సమాజానికీ మేలు ఉంటుంది. ఇప్పుడు వీటి వాడకం తగ్గిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది.
కండోమ్ ల వినియోగం తగ్గిపోవడంపై ఐక్యరాజ్యసమితి కుటుంబ నియంత్రణ విభాగం భారత ప్రతినిధి సుజాతా నటరాజన్ మాట్లాడుతూ.. ప్రజలు ప్రత్యామ్నాయ కుటుంబ నియంత్రణ విధానాలను అనుసరిస్తుండడం, కండోమ్ ల పంపిణీ తగ్గిపోవడం కారణాలుగా పేర్కొన్నారు.