: టీనేజర్లకు ఫేస్ బుక్ తీపి కబురు
18 ఏళ్ల లోపు వయసున్నవారు ఇకపై ఫేస్ బుక్ లో ఎలాంటి నియంత్రణలు లేకుండా విహరించవచ్చు. నచ్చిన పోస్టులతో, లైకులతో సందడి చేసుకోవచ్చు. ఇప్పటి వరకూ 18 ఏళ్ల లోపు వారికి పోస్టులు, ఫొటోల షేరింగ్ విషయంలో నియంత్రణలు ఉండగా వాటిని ఫేస్ బుక్ ఎత్తేసింది. అంటే కేవలం స్నేహితులు మాత్రమే చూసే వీలుండేది. ఇకపై వారు విశాల ప్రపంచంతో కనెక్ట్ అయిపోవచ్చు.