: నేటినుంచి రాజధాని, దురంతో, శతాబ్ది రైళ్ల ఛార్జీల పెంపు


రాజధాని, దురంతో, శతాబ్ది రైళ్లలో పెంచిన టికెట్ ఛార్జీలు నేటినుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మధ్యే ఈ రైళ్లలో అందించే భోజన సేవల ఛార్జీలను పెంచుతూ రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. దాంతో, టికెట్ ఛార్జీల మొత్తంలోనే భోజన సేవల ఛార్జీలు కలిసి ఉంటాయి. తద్వారా టికెట్ చార్జీలు పెంచినట్టయింది. ఈ నేపథ్యంలో అక్టోబరు 17 తర్వాత టికెట్లు రిజర్వ్ చేసుకున్న వారు టీటీఈలకు పెరిగిన ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది.

  • Loading...

More Telugu News