: పల్లె పల్లెలో సోనియాకు సమాధి: పయ్యావుల


రాష్ట్ర విభజనకు పూనుకున్న సోనియాగాంధీకి ఒక్క తిరుపతిలోనే కాదు... పదుమూడు జిల్లాల్లో ఉన్న ప్రతి పల్లెలోనూ సమాధి కడతామని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ హెచ్చరించారు. సోనియా సమాధుల నేపథ్యంలో ఎవరైనా కేసులు ఎదుర్కొంటే... వారిని తెలుగుజాతి యోధులుగా గుర్తిస్తుందని అన్నారు. ఇప్పుడు విమర్శిస్తున్న వారు.. సీమాంధ్ర ప్రయోజనాలకు సమాధి కట్టినప్పుడు ఏమయ్యారని దుయ్యబట్టారు. పళ్ళంరాజు, కావూరిలను ప్రజలు తరమడం చూసిన కాంగ్రెస్ అధిష్ఠానం... ఇప్పుడు మహిళా మంత్రులతో మాట్లాడిస్తోందని విమర్శించారు. విభజన తీర్మానం రాజ్యంగబద్ధంగా రెండుసార్లు అసెంబ్లీకి వచ్చేలా సీఎం కిరణ్ చొరవ చూపాలని పయ్యావుల సూచించారు. దీనికితోడు, కేసీఆర్ చెబుతున్నట్టు తమది బిర్యానీ కోసం ఆరాటం కాదని... రాగిముద్ద కోసం పోరాటమని పయ్యావుల ఉద్ఘాటించారు.

  • Loading...

More Telugu News