: నేడు భేటీ కానున్న సీమాంధ్ర కాంగ్రెస్ సమన్వయ కమిటీ


రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఏం చేయాలన్న విషయమై చర్చించడానికి... ఈ రోజు సీమాంధ్ర కాంగ్రెస్ సమన్వయ కమిటీ తొలిసారి భేటీ కానుంది. ఈ కమిటీకి పీసీసీ ఆమోదం కూడా ఉంది. అయితే ఈ కమిటీ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడంలో ఎంత వరకు సఫలం అవుతుందన్న విషయంలో సందేహాలున్నాయి. ఇప్పటికే కేంద్రం రాష్ట్ర విభజన వైపు వడివడిగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో, కమిటీలోని మెజారిటీ సభ్యులు సీమాంధ్ర అభివృద్ధి కోసం ప్యాకేజీలు కోరడంవైపే మొగ్గుచూపుతారని నిపుణులు అంచనా వేస్తున్నారు.

  • Loading...

More Telugu News