: సన్నబడడానికి కొన్ని చిట్కాలు


చాలామందికి తాము పదిమందిలో నాజూగ్గా మెరిసిపోవాలనే కోరిక ఉంటుంది. కానీ ఒక్కోసారి ఆహారంలో మార్పుల వల్ల వాతావరణంలోని మార్పుల వల్ల తమకు తెలియకుండానే అమ్మాయిలు లావైపోతుంటారు. ఆ తర్వాత బరువు తగ్గడానికి నానా పాట్లు పడుతుంటారు. అలా కాకుండా మన రోజువారీ ఆహారంలోనే చిన్న పాటి మార్పులు చేసుకుంటే చక్కగా నాజూకైన అందాన్ని మన సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

మన ఆహారంలో విటమిన్‌ 'సి'ని తప్పక చేర్చుకోవాలి. ఇది మనల్ని తాజాగా ఉంచడంలో ఎంతగానో తోడ్పడుతుంది. కాబట్టి ఉదయాన్నే గ్లాసు నిమ్మరసం తాగడం అలవాటు చేసుకోవాలి. అలాగే రోజుకు ఒక నారింజ పండును లేదా బత్తాయి పండును తినండి. మధ్యాహ్నం, రాత్రిపూట మన భోజనంలో పెరుగు, ఏదో ఒక ఆకుకూర ఉండేలా చూసుకోండి. ఎందుకంటే పెరుగులోని పోషకాలు చర్మసౌందర్యానికి దోహదం చేస్తాయి. అలాగే రాత్రిపూట పడుకోబోయేముందు వెన్నతీసిన పాలు తాగితే మంచిదే. దీనివల్ల చక్కటి నిద్ర పడుతుంది. నిద్రకూడా మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో తోడ్పడుతుంది. రోజుకు కనీసం ఎనిమిది గంటల నిద్ర అవసరం. అలాగే ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత అరగంటపాటు పరుగెత్తండి. మరో అరగంటపాటు నడవండి. ఇలా చిన్న చిన్న మార్పులు చేసుకుంటే బరువు పెరగడం అనే సమస్య మన దరికి చేరదు.

  • Loading...

More Telugu News