: ఆస్ట్రేలియాపై భారత్ ఘనవిజయం
భారత్ బ్యాట్స్ మెన్ వీరవిహారం చేయడంతో జైపూర్లో ఈ రోజు జరిగిన రెండో వండేలో ఆస్ట్రేలియాపై 9 వికెట్ల తేడాతో భారత్ ఘనవిజయం సాధించింది. భారత్ బ్యాట్స్ మెన్ రాణించడంతో ఆస్ట్రేలియా ఉంచిన 362 పరుగుల విజయలక్ష్యాన్ని భారత్ సునాయాసంగా ఛేదించింది. శిఖర్ ధావన్ (95), రోహిత్ శర్మ (141 నాటౌట్), విరాట్ కోహ్లీ (100 నాటౌట్) చెలరేగి ఆడడంతో 43.3 ఓవర్లలోనే టార్గెట్ చేరుకొని భారత్ ను విజయతీరాలకు చేర్చారు. ఈ వండేలో విరాట్ కోహ్లీ వేగవంతమైన సెంచురీ చేయడం ఓ విశేషంగా చెప్పుకోవాలి. 52 బంతుల్లో 7 సిక్సులు, 8 ఫోర్లతో సెంచురీ పూర్తిచేశాడు.